రేవంత్ రెడ్డి వారినే తొక్కుకుంటూ సీఎం పదవిలోకి వచ్చారు: హరీశ్ రావు

  • చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక పిచ్చి మాటలు మాట్లాడారని విమర్శ
  • కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి పాపం పోదని ఆగ్రహం
  • షార్ట్ కట్‌లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను తొక్కేస్తున్నాడని విమర్శ
తాను తొక్కుకుంటూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ ఆయన పదవిలోకి వచ్చేందుకు తొక్కింది కాంగ్రెస్ నాయకులనే అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రావడం లేదని విమర్శించారు.

హన్మకొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక హన్మకొండ సభలో పిచ్చి మాటలు మాట్లాడారన్నారు. ఈ ప్రభుత్వం చేసిన ఘోరాలను ప్రజలు మరిచిపోలేరన్నారు.

కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి పాపం పోదన్నారు. షార్ట్ కట్‌లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను కూడా తొక్కేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు.

Harish Rao
Revanth Reddy
BRS
Congress

More Telugu News